- భూగోళంపై తూర్పు, పడమరలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు?
Answer : అక్షాంశాలు
2. భూగోళంపై ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
Answer : రేఖాంశాలు
3. భూగోళాన్ని రెండు సమాన అర్థ భాగాలుగా విభజిస్తూ గీసిన ఊహారేఖను ఏమంటారు?
Answer : భూమధ్యరేఖ
4. 0° అక్షాంశమును ఏమని పిలుస్తారు?
Answer : భూమధ్యరేఖ
5. 23 1/2° ఉత్తర అక్షాంశమును ఏమని పిలుస్తారు?
Answer : కర్కటరేఖ
6. 23 1/2° దక్షిణ అక్షాంశమును ఏమని పిలుస్తారు?
Answer : మకరరేఖ
7. 66 1/2° ఉత్తర అక్షాంశమును ఏమని పిలుస్తారు?
Answer : ఆర్కిటిక్ వలయం
8. 66 1/2° దక్షిణ అక్షాంశమును ఏమని పిలుస్తారు?
Answer : అంటార్కిటిక్ వలయం
9. అక్షాంశంతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య? 181
Answer : ప్రతి రెండు అక్షాంశాల మధ్య దూరం?
10. 111 కి.మీ.లు
Answer : ఆయనరేఖలుగా ఏ రేఖలను పేర్కొంటారు?
11. కర్కటరేఖ మరియు మకరరేఖ
కర్కటరేఖ నుండి ఆర్కిటిక్ వలయానికి, మకరరేఖ నుండి అంటార్కిటిక్ వలయానికి మధ్యగల ప్రాంతాలను ఏమంటారు?
Answer : సమశీతోష్ణ మండలం
12. ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాల నుండి ధృవాల వరకు గల ప్రదేశాన్ని ఏమంటారు?
Answer : అతిశీతల మండలం
13. మార్చి 21, సెప్టెంబర్ 23న సూర్యుడు ఏ రేఖ వద్ద ఉంటాడు?
Answer : భూమధ్యరేఖ
14. ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి ఉపరితలంపై గీసిన అర్థ వలయాకార ఉపరేఖలను ఏమంటారు?
Answer : రేఖాంశాలు
15. రేఖాంశాలు వేటిని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి?
Answer : సమయాన్ని
16. 0° రేఖాంశమును ఏమని పిలుస్తారు?
Answer : గ్రీనిచ్
17. మొత్తం రేఖాంశాల సంఖ్య?
Answer : 180
18. అంతర్జాతీయ దినరేఖగా ఏ రేఖాంశమును పేర్కొంటారు?
Answer : 180° తూర్పు-పశ్చిమ రేఖాంశం
19. గ్రీనిచ్ రేఖ ఏ రెండు ఖండాల గుండా పయనిస్తుంది?
Answer : యూరప్, ఆఫ్రికా
20. గ్రీనిచ్ రేఖ పయనించే ముఖ్యమైన పట్టణాలు?
Answer : లండన్, వాలేషియా, అల్జీరియా, అక్రా
21. గ్రీనిచ్ రేఖ ఏ నది గుండా పయనిస్తుంది?
Answer : థేమ్స్
22. భూమధ్యరేఖ వద్ద రెండు రేఖాంశాల మధ్య సమయ వ్యత్యాసం ఎంత?
Answer : 4 నిమిషాలు
23. ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా దేనిని పేర్కొంటారు?
Answer : గ్రీనిచ్
24. సూర్యుడు ఒక గంటలో ఎన్ని రేఖాంశములను దాటుతాడు?
Answer : 15 రేఖాంశాలు
25. సూర్యుడు ఒక రోజులో ఎన్ని డిగ్రీలు దాటుతాడు?
Answer : 360°
26. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది?
Answer : 82 1/2° తూర్పు రేఖాంశం
27. భారతదేశ ప్రామాణిక కాలమానం లేకపోతే అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ల మధ్య సమయ వ్యత్యాసం ఎంత?
Answer : 2 గంటలు
28. 82 1/2° తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పయనిస్తుంది? అవి ఏవి?
Answer : 5 రాష్ట్రాలు
1) ఉత్తరప్రదేశ్, 2) మధ్యప్రదేశ్, 3) చత్తీస్గఢ్,
4) ఒడిశా, 5) ఆంధ్రప్రదేశ్