నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం
కేంద్ర ప్రభుత్వ పథకం “నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMSS)” మే, 2008 లో ప్రారంభించబడింది. పథకం యొక్క లక్ష్యం VIII తరగతి వద్ద డ్రాప్ అవుట్ లను నివారించటాన్ని ప్రోత్సహించేలా ఆర్ధికంగా బలహీన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను ఇచ్చి వారిని ద్వితీయ దశ అధ్యయనాన్ని కొనసాగించేలా చేయటం.
స్కాలర్షిప్ మొత్తం
ఎంపికైన ప్రతి విద్యార్థికి ఏడాదికి స్కాలర్షిప్. రూ 6000 / – (రూ .500 / – నెలకు) తరగతి IX నుండి XII వరకు రాష్ట్ర ప్రభుత్వ, గుర్తింపు పొందిన స్ధానిక సంస్ధ పాఠశాలలో చదువుతున్న వారికి ఇస్తారు.
అర్హత ప్రమాణం
- తల్లిదండ్రుల ఆదాయం అన్ని మూలాల నుండి రూ 1,50,000 /- కంటే తక్కువ ఉన్నవిద్యార్థులు స్కాలర్షిప్లను పొందడానికి అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి.
- విద్యార్థులు స్కాలర్షిప్ అవార్డుకు ఎంపిక పరీక్ష రాసేందుకు క్లాస్ VII పరీక్షలో 55% మార్కులు లేదా సమానమైన తరగతిలో పొంది ఉండాలి (5% ఎస్సీ/ఎస్టీకు రిలాక్సేషను కలదు).
- విద్యార్థులు ప్రభుత్వ స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలో అధ్యయనం చేయాలి. “కేంద్రీయ విద్యాలయాలు” మరియు” జవహర్ నవోదయా విద్యాలయాల”లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద స్కాలర్షిప్ పొందటానికి అర్హులు కారు. అదేవిధంగా, బోర్డింగ్, వసతి, విద్య వంటి సౌకర్యాలు అందించే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నడిపే రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద స్కాలర్షిప్ అర్హత లేదు.
- స్కాలర్షిప్ అవార్డు అభ్యర్థి ఎనిమిదవ తరగతి పరీక్షలో కనీసం 55% మార్కులు లేదా సమానమైన తరగతిలో ఎంపిక సమయంలో పొంది ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5% సడలింపు ఉంటుంది.
- ద్వితీయ మరియు ఉన్నత మాధ్యమిక దశలో లేదా సమానమైన క్లాసులు IX నుంచి XII లో స్కాలర్షిప్, భారతదేశం లో మాత్రమే, నాలుగు సంవత్సరాల గరిష్ట కాలానికి చెల్లించబడుతుంది.
ఎంపిక ప్రక్రియ
స్కాలర్షిప్పుల అవార్డుకు విద్యార్థుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పరీక్ష ద్వారా జరుగుతుంది. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే జాతీయ స్థాయిలో (రెండవ దశలో) NCERT విద్యార్థుల అభ్యర్ధిత్వ పరీక్ష నిర్వహిస్తున్నారు. అదే పరీక్ష రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాలలో మీన్స్ కమ్ మెరిట్ ఉపకార అవార్డుకు అభ్యర్థుల ఎంపిక కోసం ఉపయోగిస్తారు.
పథకం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.