YUVIKA 2022: యువిక 2022 పేరుతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది ఇస్రో.
స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్‌లో చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటి వాళ్లందరికీ మంచి అవకాశం కల్పించింది ఇస్రో. యువికా అంటే యువ విజ్ఞాని కార్యక్రమం లేదా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసింది.
స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్‌లో లేటెస్ట్‌గా వచ్చిన అప్‌డేట్స్‌ను ఈ యువికాలో చెప్పనుంది ఇస్రో. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈ యువికా ద్వారా విద్యార్థుల్లో సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ పట్ల ఆసక్తిని పెంచాలని భావిస్తోంది ఇస్రో. భవిష్యత్‌లో వాళ్లంతా ఈ సెగ్మెంట్‌లో కెరీర్ ఎంచుకునేలా ప్రోత్సహిస్తోంది.
ఈ యువికాలో ఏం చెబుతారు?
ఇది రెండు వారాల కార్యక్రమం. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉద్దేశించింది. అక్కడే ఉండి స్పేస్ సైన్స్, స్పేస్ టెక్నాలజీపై అవగాహన పెంచుకునేందుకు వీలు కల్పిస్తారు.
స్పేస్ టెక్నాలజీపై చర్చలు జరుపుతారు. పేరున్న సైంటిస్టులు వచ్చి తమ అనుభవాన్ని విద్యార్థులకు వివరిస్తారు. కొన్ని ప్రయోగాలకు చేసి చూపిస్తారు. ఇస్రోకు చెందిన ప్రయోగశాలలను చూపిస్తారు. కొన్ని ప్రయోగాలు చేయిస్తారు. అందులోని లోపాలు విద్యార్థులకు వివరిస్తారు.
భారత్‌లో ఉన్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది ఇస్రో.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 150 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తుంది.
ఈ ఎంపిక పూర్తి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా జరుగుతుంది. సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
మూడేళ్ల నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, సైన్స్ కాంపిటీషన్స్‌లో విజయం సాధించిన వాళ్లకు, ఆన్‌లైన్ క్విజ్ కాంపిటీషన్ విజేతలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది.
పంచాయతీ పరిధిలో ఉన్న స్కూల్స్ నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వెయిటేజీ ఉంటుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని చివరిగా శ్రీహరి కోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్తారు.
ఎంపికైన విద్యార్థుల ఖర్చు మొత్తం ఇస్రో భరిస్తుంది. విద్యార్థుల తరఫున తల్లిగానీ, తండ్రి గానీ లేదా గార్డియన్ గానీ వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. వాళ్ల ట్రావెలింగ్ ఖర్చును ఇస్రో భరిస్తుంది.
ఈ యువికా మే 16 నుంచి 28 మధ్య ప్రారంభమవుతుంది.
మరిన్ని వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.
https://www.isro.gov.in/capacity-building/yuvika-yuva-vigyani-karyakram-young-scientist-programme
ఎలా అప్లై చేయాలి
అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెట్టిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి.
ఫామ్ ఫిల్ చేసిన 48 గంటల తర్వాత ఆన్‌లైన్ క్విజ్ వస్తుంది. జాగ్రత్తగా చదివి, నిబంధనల మేరకు ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి.
ఆన్‌లైన్ క్విజ్ కంప్లీట్ అయిన గంట తర్వాత యువికా పోర్టల్‌లోకి వెళ్లవచ్చు.
జాగ్రత్తగా చదివి డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ స్వీకరణ తేదీ: మార్చి 10
ఆఖరు తేదీ: ఏప్రిల్ 10 నాలుగు గంటలలోపు ఫిల్ చేయాలి.
ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల తేదీ: ఏప్రిల్ 20